![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -341 లో.. కావ్య బావ ముందు తనేం తక్కువ కాదని నిరూపించుకునే ప్రయత్నంలో రాజ్ కి నడుం పట్టేస్తుంది.. రాజ్ బెడ్ పై పడుకుని పాట్లు పడుతుంటే.. నేను మసాజ్ చెయ్యాలా అంటూ కావ్య వస్తుంది. ఇలాంటివన్ని మీకెందుకని కావ్య అంటుంది. మీరు గొప్పలకి పోయి నాకు తిప్పలు తెచ్చారంటూ కావ్య మందు రాస్తుంటుంది. ఇంకెన్ని రోజులులే.. నిన్ను వదిలేసాక మీ శ్వేత అక్కనే అన్ని చూసుకుంటుందని రాజ్ అంటాడు.
ఆ తర్వాత కావ్య వాళ్ళు చేస్తున్న డ్రామా గురించి మీ అల్లుడిని అడిగి తెలుసుకోండి అని కృష్ణమూర్తికి కనకం చెప్తుంది. అప్పుడు కృష్ణమూర్తి అమెరికా నుండి వచ్చిన అల్లుడుకి ఫోన్ చేసి అడిగి తెలుసుకుంటాడు. మీరేం టెన్షన్ పడకండి.. రాజ్ లో ఇప్పుడిప్పుడే మార్పు మొదలైంది. జెలసీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా కొన్ని రోజుల్లో కావ్య లేకపోతే నేను ఉండలేను.. తనే నా భార్య అంటాడని అతను చెప్పగానే కృష్ణమూర్తి, కనకం ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అప్పు వచ్చి నేను కానిస్టేబుల్ కి అప్లై చేశాను. నాకు ఒక సర్ పరిచయమయ్యాడు అతనే గైడ్ చేస్తున్నాడు. కానిస్టేబుల్ అయితే ఎస్సై అవడం ఈజీ అంట అని అప్పు చెప్తుంటుంది. అప్పుడే అప్పు చెప్తున్న రిటైర్డ్ ఎస్సై వచ్చి అప్పుకి బుక్స్ ఇచ్చి చదవమని చెప్తాడు. తమ కూతురికి ఇంత సాయం చేస్తున్నారు థాంక్స్ అని కృష్ణమూర్తి అతనికి చెప్తాడు. మరొకవైపు నేను ఇక్కడ ఉండను బయట హోటల్ లో ఉంటానని కావ్య వాళ్ళ బావ ఇందిరాదేవితో అంటుంటాడు. ఇక్కడే ఉండాలని ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తో కావ్య తన బావతో బయటకు వెళ్తుంది. వాళ్లు ఎక్కడికి వెళ్తాన్నారోనని రాజ్ కనుక్కోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత అలా ఒక ఆడమగ బయటకు వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారోనని రుద్రాణి, ధాన్యలక్ష్మి ఇద్దరు అంటారు. అందరు మీలాగే ఆలోచించరని అపర్ణ, ఇందిరాదేవి అంటారు.
ఆ తర్వాత అనామిక ఆఫీస్ కి వెళ్తున్న కళ్యాణ్ తో.. నువ్వు ఖాళీగా ఇలా రోజు వెళ్తూ వస్తే సరిపోదు. మీ అన్నయ్య లాగా అవ్వాలని అంటుంది. నీకేం తెలుసు నేను ఆఫీస్ కి వెళ్లి కవితలు రాసుకుంటున్నానని కళ్యాణ్ అనుకుంటాడు. ఒక బ్రాంచ్ ని చూసుకుంటానని మీ అన్నయ్యతో చెప్పమని కళ్యాణ్ కి అనామిక చెప్తుంది. ఆ తర్వాత కావ్య, తన బావ ఇద్దరు కాఫీ షాప్ కి వెళ్తారు. వాళ్ళ వెనకాలే రాజ్ శ్వేత ఇద్దరు వెళ్తారు. ఆ తర్వాత కావ్య బావ వెయిటర్ కి డబ్బులు ఇచ్చి.. కొన్ని ఐటమ్స్ తీసుకొని రమ్మని చెప్తాడు. అతను ఏం చెప్పాడో అని రాజ్ వెయిటర్ ని అడిగి తెలుసుకుంటాడు. తరువాయి భాగంలో రాజ్, కావ్య ఇద్దరు ఒకరికొకరు వాలెంటైన్స్ డే విషెస్ చెప్పుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |